వేసవిలో అందానికి.. ఈ మూడూ!

ఎండ వేడి ఆరోగ్యం పైనే కాదు.. చర్మ సౌందర్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో అందాన్ని సంరక్షించుకోవడానికి ఈ మూడు చిట్కాల్ని ప్రయత్నించండి.

Published : 17 Apr 2024 12:39 IST

ఎండ వేడి ఆరోగ్యం పైనే కాదు.. చర్మ సౌందర్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో అందాన్ని సంరక్షించుకోవడానికి ఈ మూడు చిట్కాల్ని ప్రయత్నించండి.

⚛ గుప్పెడు వేపాకుల్ని స్నానం చేసే నీటిలో వేయండి.. ఓ గంట తర్వాత ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడంతో పాటు.. ఆ నీళ్లు ముఖంపై ఏర్పడిన బ్లాక్‌హెడ్స్‌ సమస్యను దూరం చేస్తాయి.

⚛ వేసవిలో మధ్యాహ్నం పూట నిద్ర రావడం, అలసిపోయినట్లుగా అనిపించడం, వేడి-చెమట వల్ల చిరాగ్గా అనిపించడం సహజం. మరి వీటి నుంచి బయటపడాలంటే భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ పదార్థాల్ని తీసుకోవడం వల్ల చర్మం తేమగా మారడంతో పాటు ఈ కాలంలో వేధించే పిగ్మెంటేషన్, ట్యాన్‌.. సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది.

⚛ ఈ కాలంలో ఎండ వేడి వల్ల ఒళ్లంతా చెమటలు పట్టి చెమట వాసన వస్తుంటుంది. మరి, ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే.. శుభ్రపరిచిన వట్టి వేర్లను తాగే నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆపై ఆ వేర్లను తొలగించి ఆ నీటిని తాగితే సరిపోతుంది. ఇక ఈ చిట్కా వల్ల చర్మం నవయవ్వనంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్