ఫోన్‌కు దూరంగా..

కొద్దిసేపు అనుకుంటూ ఏదో వీడియో చూస్తూ కూర్చుంటాం. సమయం ఎలా గడిచిందో కూడా గమనించం. నిద్ర సరిగా లేక మరుసటి రోజు అలసిన ముఖం! పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచడానికి ఎన్ని తిప్పలు పడతాం.

Updated : 29 Dec 2022 00:22 IST

కొద్దిసేపు అనుకుంటూ ఏదో వీడియో చూస్తూ కూర్చుంటాం. సమయం ఎలా గడిచిందో కూడా గమనించం. నిద్ర సరిగా లేక మరుసటి రోజు అలసిన ముఖం! పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచడానికి ఎన్ని తిప్పలు పడతాం. కనిపించకుండా ఎక్కడో దాస్తుంటాం కూడా. ఇలాంటప్పుడు కొన్ని ముఖ్యమైన కాల్స్‌ మిస్‌ అవుతుంటాయి. పిల్లల్ని కోప్పడి హోంవర్క్‌ చేయిస్తుంటాం. మనమేమో ఫోన్‌ చేతిలో పట్టుకొని ఉంటాం. వాళ్ల దృష్టి మాత్రం చేసే వర్క్‌ మీద ఎందుకుంటుంది? ‘స్వీయ నియంత్రణ’ ఉండట్లేదు అనుకున్నవాళ్ల కోసమే వచ్చాయీ ‘ఫోన్‌లాక్‌ బాక్స్‌’లు. పెట్టెలాంటి దాంట్లో ఫోన్‌ను పెట్టి ఎంతసేపు దూరంగా ఉండాలనుకుంటున్నారో టైమ్‌ సెట్‌ చేసుకుంటే సరిపోతుంది. మరి ఫోన్‌ వస్తే ఎలాగంటారా? ఫోన్‌ చేసుకోవడానికీ, వచ్చినదాన్ని మాట్లాడటానికీ వీలుగా తయారు చేశారు. ‘సెల్ఫ్‌ కంట్రోల్‌ టైమర్‌ లాకర్‌’గానూ పిలిచే దీని అవసరం మీకూ ఉందనిపిస్తోందా? అయితే ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్