Health: ముప్పైల్లో.. పట్టించుకోవాలా?

వయసు 30. స్నేహితురాలు ఇప్పట్నుంచే చర్మాన్ని పట్టించుకోవాలి. ముడతలు, గీతలు రాకుండా సీరమ్‌, క్రీములు వాడమంటోంది. నిజమేనా?

Published : 21 May 2023 01:22 IST

వయసు 30. స్నేహితురాలు ఇప్పట్నుంచే చర్మాన్ని పట్టించుకోవాలి. ముడతలు, గీతలు రాకుండా సీరమ్‌, క్రీములు వాడమంటోంది. నిజమేనా?

- ఓ సోదరి

ముప్పైల్లో పడ్డాక చర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారిగా వచ్చేయవు కానీ.. ఇప్పట్నుంచే వృద్ధాప్య ఛాయలు ప్రారంభం అవుతాయి. కొల్లాజెన్‌, చర్మం సాగే గుణం తగ్గుతూ వస్తాయి. రెండుపూటలా క్లెన్సింగ్‌ తప్పనిసరి చేసుకోండి. తర్వాత మీ చర్మతీరుకు తగ్గ మాయిశ్చరైజర్‌, పగలైతే సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. మీ చర్మతీరేది? యాక్నే ఉంటే.. జెల్‌ ఆధారిత క్లెన్సర్‌తోపాటు పగలు క్లెండమైసిన్‌, నికోటినమైడ్‌ క్రీములు, రాత్రి రెటినాల్‌, రెటినాయిక్‌ యాసిడ్‌ క్రీములు వాడండి. యాక్నే రావు, యాంటీ ఏజెనింగ్‌గానూ పనిచేస్తాయి. పొడిచర్మమైతే పీహెచ్‌ 5-5.5 ఉన్న క్లెన్సర్లు, క్రీమ్‌ ఆధారిత సీరమ్‌ వాడాలి. అలిగో పెప్టైడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లాంట్‌ బటర్‌, హైలురోనిక్‌ యాసిడ్‌, బీ5, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉన్న క్రీములు మంచిది. ఇంకా మల్టీవిటమిన్‌ మాస్క్‌ వారానికి రెండుసార్లు వేసుకోవాలి. నార్మల్‌, కాంబినేషన్‌ స్కిన్‌ వాళ్లు.. హైలురోనిక్‌ యాసిడ్‌, గైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, కలబంద ఉన్నవి తీసుకోండి. చార్‌కోల్‌ మాస్క్‌లు వారానికోసారి వేసుకోండి. ఇక జిడ్డు చర్మమైతే ఆయిల్‌ ఫ్రీ ఫేస్‌వాష్‌, ఆల్కహాల్‌లేని టోనర్‌ వాడాలి. మ్యాట్‌ ఫినిష్‌ మాయిశ్చరైజర్‌, జెల్‌ ఆధారిత సన్‌స్క్రీన్‌ ఎంచుకోవాలి. మీ క్రీముల్లో సాల్సిలిక్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌, నియాసినమైడ్‌ ఉండాలి. సి, ఇ విటమిన్లు, పెప్టైడ్‌లు ఉన్న సీరమ్‌లు, రాత్రి రెటినాల్‌, పెప్టైడ్‌ ఉన్న క్రీములు వాడాలి.

వీటితోపాటు ఇ, సి, డి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. తాజాపండ్లు, కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. స్క్రబింగ్‌ వారానికోసారే చేయాలి. స్నానం త్వరగా ముగించాలి. కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోండి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్