Modelling: లెహెంగాతో గ్లామర్‌ లుక్‌..

సంప్రదాయం, ఆధునికతల మేళవింపుగా రూపొందిందే లెహెంగా. వయసు, హోదాలతో ప్రమేయం లేకుండా అందరూ ధరిస్తున్నారు. అందులో ఉన్న ఆకర్షణలూ, సుగుణాల గురించి టీనేజర్లు ఏం చెబుతున్నారంటే..

Updated : 19 May 2023 00:41 IST

సంప్రదాయం, ఆధునికతల మేళవింపుగా రూపొందిందే లెహెంగా. వయసు, హోదాలతో ప్రమేయం లేకుండా అందరూ ధరిస్తున్నారు. అందులో ఉన్న ఆకర్షణలూ, సుగుణాల గురించి టీనేజర్లు ఏం చెబుతున్నారంటే..

* చూపులకు ఎంత అందాలు చిందిస్తుందో నడుస్తుంటే అంత సౌఖ్యంగానూ ఉంటుంది. పైగా పుట్టినరోజు మొదలు పెళ్లి వరకూ ఏ వేడుకకైనా నప్పుతుంది కనుక గబుక్కున లెహెంగాకే ఆకర్షితులం అవుతాం. వీటిల్లో సింపుల్‌వీ, గ్రాండ్‌గా అదర గొట్టేవీ.. అన్నీ ఉంటాయి కనుక ఆ సందర్భానికి తగినట్టుగా వేసుకోవచ్చు.

* చీర భారతీయతకు చిహ్నం కదా! లెహెంగా కూడా ఆ తీరులోనే ఉంటుంది. కట్టుకునే శ్రమ లేకుండా ఫిట్టింగ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

*  ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, సంగీత్‌, మెహెందీ ఫంక్షన్లకు లెహెంగాను మించింది లేదు. నాజూకైన నడుము ఒంపులు కనిపిస్తున్నా ఎక్కడా డిగ్నిటీకి భంగం రాదు.

*  ఫ్యాషన్‌ డిజైనర్లు లెహెంగా మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. పొట్టి క్రాప్‌ టాప్స్‌ నుంచి పొడవాటి చోళీ వరకూ వెరైటీ టాప్స్‌ రూపొందిస్తున్నారు. సెల్‌ఫోన్‌, వాలెట్‌ లాంటివి పెట్టుకోవడానికి జేబులు కూడా కుట్టేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని