Published : 09/01/2023 00:32 IST

తలుపుల ఖాళీలకు పరికరం

న ఇళ్లలో కొన్ని తలుపులు పూర్తిగా మూసుకోక కాస్తంత ఖాళీ కనిపిస్తుంటుంది. ఆ మాత్రానికి తలుపులు మార్చలేక.. అలాగని ఆ వెలితిని సరిపెట్టుకోలేక అవస్థ పడుతుంటాం. దీనికి పరిష్కారంగా వచ్చిందే డోర్‌ బాటమ్‌ సీలింగ్‌ స్ట్రిప్‌ గార్డ్‌. తలుపు కింది భాగంలో దీన్ని అమర్చితే దుమ్మూ ధూళీ, పురుగూ పుట్రా లోనికి రావు. చల్లటి లేదా వేడి గాలులు కూడా చొరబడవు. మన మాటలు బయటకు, బయటి శబ్దాలు మనకూ వినిపించవు. పెట్టి తీయడం చాలా సులువు. మన్నిక ఎక్కువ, శుభ్రపరచడం తేలిక. దీన్ని నీళ్లతో కడగకూడదు. వస్త్రంతో తుడవాలి. తలుపుకు లేదా ఫ్లోర్‌కు ఏమాత్రం నష్టం జరగదు. అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఈ అండర్‌ డోర్‌ డ్రాఫ్ట్‌ స్టాపర్‌ను ఏ తలుపునకైనా అమర్చుకోవచ్చు. కిటికీలకు కూడా పెట్టవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని