Yoga - Virasana: వీరాసనంతో ధైర్యం స్థైర్యం

జీవితంలో ప్రశాంతత, ఆత్మస్థైర్యం చాలా అవసరం. కానీ ఒక్కోసారి అవి కరవైనట్లు అశాంతిగా, బేలగా ఉంటుంది. గుప్పెడంత గుండెలో ఏవేవో ఆలోచనలు అలజడి సృష్టించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

Published : 04 Mar 2023 00:17 IST

జీవితంలో ప్రశాంతత, ఆత్మస్థైర్యం చాలా అవసరం. కానీ ఒక్కోసారి అవి కరవైనట్లు అశాంతిగా, బేలగా ఉంటుంది. గుప్పెడంత గుండెలో ఏవేవో ఆలోచనలు అలజడి సృష్టించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటి స్థితి నుంచి త్వరగా బయటపడాలి. లేదంటే ఆందోళన పెరుగుతుంది. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. జీవితం నిరాసక్తిగా తోస్తుంది. అందుకు భిన్నంగా శాంతంగా, ధైర్యంగా ఉండాలంటే వీరాసనం ప్రయత్నించండి.

ఎలా చేయాలంటే... సౌకర్యంగా ఉండేలా కూర్చోవాలి. ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలిని వంచి నేలపై ఆనించి, దాని పక్కనే కుడి పాదాన్ని ఉంచాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలి మీద, కుడి మోచేతిని కుడి మోకాలి మీద ఉంచాలి. కుడి అరచేతిని చెంపకు ఆనించి గడ్డం కింద పెట్టి, కళ్లు మూసుకుని కూర్చోవాలి. రెండు నిమిషాలు కుడి కాలి మీద, రెండు నిమిషాలు ఎడమ కాలి మీద కూర్చోవాలి. అలా కాళ్లు మారుస్తూ రెండుసార్లు చేయాలి.

ఎన్ని ప్రయోజనాలో... వీరాసనం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ధైర్యం చేకూరుతుంది. ఏదైనా ఒక అలవాటు మానేయాలనుకున్నప్పుడు అందుకు కావలసిన దృఢ సంకల్పం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంతో సులువైన ఈ ఆసనాన్ని నిత్యం చేయడానికి ప్రయత్నించండి. మనసు తేటగా ఉంటుంది. ఎలాంటి ఆందోళనలూ దరిచేరవు.  ఇంకెందుకాలస్యం.. వెంటనే ప్రారంభించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్