కళ్లజోడు మచ్చలు పోవాలంటే..!

ఇష్టమున్నా లేకున్నా కొంతమందికి కళ్లద్దాలు వాడక తప్పదు. అయితే అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడుతుంటాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? చూద్దాం రండి..   

Published : 10 Jun 2024 22:50 IST

ఇష్టమున్నా లేకున్నా కొంతమందికి కళ్లద్దాలు వాడక తప్పదు. అయితే అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడుతుంటాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? చూద్దాం రండి..

కలబందతో..

అందుబాటులో ఉండే సహజమైన పదార్థాల్లో కలబంద కూడా ఒకటి. కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసం లేదా అందులో ఉండే జిగురు లాంటి పదార్థాన్ని (జెల్) తీసుకుని మచ్చలు ఉన్న చోట అప్త్లె చేయాలి. ఇది సమస్య నుంచి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.

కీరాదోసతో..

ఫేషియల్స్ వేసుకున్నప్పుడు కళ్లు విశ్రాంతి పొందడానికి, చల్లగా ఉండటానికి కళ్ల పైన కీరాదోస ముక్కలు పెడతాం. అయితే ఇదే కీరా వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలు కూడా తగ్గుతాయి. ఎలాగంటే.. కీరాదోస ముక్కతో మచ్చలు ఉన్న చోట రుద్దుకోవచ్చు లేదా కీరా రసానికి బంగాళాదుంప, టమాటా రసం కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రాయాలి. బాగా ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా..

⚛ నారింజ తొక్కల పొడి, పాలు, పెరుగు, బంగాళాదుంప, టమాటా.. ఇలాంటి పదార్థాలను ఉపయోగించి మచ్చలు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.

⚛ అలాగే సబ్బు, గోరు వెచ్చటి నీరు ఉపయోగించి కళ్లద్దాలను శుభ్రపరచాలి. లేదంటే కళ్లద్దాలపై ఏర్పడే బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రబడడం, కంటి చుట్టూ చర్మం నల్లగా మారిపోవడం, మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.

⚛ అలాగే రోజూ తగినన్ని నీళ్లు తాగుతుంటే రక్త ప్రసరణ బాగుంటుంది.

⚛ కళ్లద్దాలతో ఎక్కువగా అవసరం లేనప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్