ఫ్లవర్‌వాజుల్లో పూలు.. తాజాగా!

ఇంటి అలంకరణలో భాగంగా అక్కడక్కడా ఫ్లవర్‌వాజ్‌లు అమర్చడం మామూలే. కొంతమంది వీటిలో కృత్రిమ పూలకు బదులు అసలైన పూలనే ఉంచుతుంటారు. కానీ, వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి తక్కువ సమయంలోనే వాడిపోతాయి.

Published : 20 Feb 2024 19:56 IST

ఇంటి అలంకరణలో భాగంగా అక్కడక్కడా ఫ్లవర్‌వాజ్‌లు అమర్చడం మామూలే. కొంతమంది వీటిలో కృత్రిమ పూలకు బదులు అసలైన పూలనే ఉంచుతుంటారు. కానీ, వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి తక్కువ సమయంలోనే వాడిపోతాయి. అలా జరగకుండా ఫ్లవర్‌వాజుల్లో అమర్చిన పూలు రోజంతా తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

⚛ రోజాపూలు కొనడానికి వెళ్లినప్పుడు పూల రెక్కలన్నీ ఒక్కచోట కలిసే కాడ భాగాన్ని పరిశీలించండి. దాన్ని నొక్కినప్పుడు అది మరీ మెత్తగా అనిపిస్తే ఆ పూలు పాతవని అర్థం. అలాకాకుండా కాస్త మెత్తగా, కాస్త గట్టిగా అనిపిస్తే అవి తాజా పూలని అర్థం. అలాంటి వాటిని ఎంచుకుంటే రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

⚛ అలాగే ఎక్కువ రకాల పువ్వులు తీసుకున్నప్పుడు వేటికవి విడివిడిగా ప్యాక్ చేయించుకోవాలి. అలా చేస్తే ఇంటికి చేరుకున్న తర్వాత వాటిని సులువుగా విడదీసుకోవచ్చు. పువ్వులు కూడా నలిగిపోకుండా ఉంటాయి.

⚛ ఫ్లవర్ వాజుల్లో నీళ్లలో ఉంచే పువ్వులకు కాండం ఎంతవరకు నీటిలో మునుగుతుందో చూసుకుని దాని కింద ఉండే ఆకులు తీసేయాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు శుభ్రంగా ఉంటాయి. అలాగే పువ్వులూ ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

⚛ మీరు తీసుకువచ్చిన పువ్వుల కాండాలు కూడా సరిచూసుకోవాలి. అవి విరిగి ఉన్నా.. లేక చివర్లు ఎండిపోయినట్టు ఉన్నా.. వాటిని కట్ చేయాలి. కత్తిరించిన తర్వాత వాటిని ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేంత వరకూ నీటిలో ఉంచాలి.

⚛ ఫ్లవర్‌వాజ్‌లు కూడా శుభ్రంగా ఉంటేనే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. అందుకే సబ్బు, వేడినీళ్లను ఉపయోగించి ఫ్లవర్‌వాజ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

⚛ వాడిపోయిన పూరేకల్ని తొలగించాలి. ఫ్లవర్‌వాజ్‌లో ఉండే నీళ్లు ఏ మాత్రం జిగురుగా అనిపించినా వెంటనే మార్చేయాలి.

⚛ నేరుగా ఎండ పడే చోట, అధిక ఉష్ణోగ్రత ఉండే చోట ఫ్లవర్‌వాజులు ఉంచినా అందులో అమర్చిన పూలు త్వరగా వాడిపోతాయి. కాబట్టి చల్లటి ప్రదేశాల్లోనే ప్లవర్‌వాజులు ఏర్పాటుచేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్