అల్పాహారం.. మానేస్తున్నారా?

పని హడావుడిలో సమయం లేదు.. డైట్‌లో ఉన్నా.. బరువు తగ్గాలి.. కారణమేదైనా అల్పాహారం మీదే ప్రభావం. ఆలస్యంగా తింటారు లేదా అసలు మానేస్తుంటారు.

Published : 09 Jan 2023 00:32 IST

పని హడావుడిలో సమయం లేదు.. డైట్‌లో ఉన్నా.. బరువు తగ్గాలి.. కారణమేదైనా అల్పాహారం మీదే ప్రభావం. ఆలస్యంగా తింటారు లేదా అసలు మానేస్తుంటారు. వీటి వల్ల అదనపు సమస్యలూ వస్తాయంటున్నారు నిపుణులు.

* బరువు తగ్గాలంటే టిఫిన్‌ మానేయాలనుకుంటారు కొందరు. నిద్రలోనే చాలా గంటలు గడిచి పోతాయి. అంటే మామూలు కంటే ఎక్కువ సమయం ఆహారానికి దూరంగా ఉంటాం. ఇది ఇంకా పెరిగితే మెటబాలిజం దెబ్బ తింటుంది. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడం, తలనొప్పి వంటివి కలుగుతాయి. ఒత్తిడితో అతిగా తినడం కనిపిస్తుంది కదా కొందరిలో! అల్పాహారం సరిగా తీసుకునే వారిలో ఆ సమస్య ఉండదట.

* కాస్త ఆలస్యమైంది.. అంతే! చాలా సులువుగా అనేస్తాం. కానీ నిద్ర లేచిన గంటలోపు టిఫిన్‌ పూర్తి చేయాలి. అది కూడా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో నిండి ఉండాలి. ఇడ్లీ, దోశ వంటివి నచ్చకపోతే గుడ్డు, పాలు, చిరు ధాన్యాలు, నట్స్‌, ఓట్స్‌, రోటీ వంటివి తీసుకోవచ్చు.

* తెల్లవారే దాకా ఏమీ తినం కాబట్టి, రాత్రి భోజనం భారీగా తీసుకోవాలి అనుకుంటారు చాలా మంది. ఇది అపోహే! అల్పాహారమే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. రాత్రి తేలిగ్గా తీసుకుంటే కెలోరీలు కరిగి బరువు అదుపులో ఉంటుంది.

* ఆరోగ్యమని స్మూథీలతో సరిపెడుతున్నారా? ఇదీ మంచిది కాదు. మెటబాలిజంలో మార్పులొస్తాయి. చక్కెర స్థాయులూ పడిపోవడంతో పాటు పోషకాలూ అందవు. పండ్లు, కొద్దిపాటి ప్రొటీన్‌ ఆహారాన్నీ జోడించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్