ఆలుమగల మధ్య ఇవెందుకు..?

సాంకేతిక ఉపకరణాలని ఈ రోజుల్లో పూర్తిగా దూరం చేసుకోలేం.

Updated : 09 Dec 2022 12:57 IST

సాంకేతిక పరిజ్ఞానం అందరి జీవితాల్నీ ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తోంది. అయితే ఇది భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత జీవితాన్నీ దెబ్బతీస్తుందంటూ అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. మీరూ ఆ జాబితాలో ఉంటే బయటపడేందుకు మార్గాలు వెతకండి..

సాంకేతిక ఉపకరణాలని ఈ రోజుల్లో పూర్తిగా దూరం చేసుకోలేం. కాబట్టి భార్యాభర్తలిద్దరూ కొన్ని నియమాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆఫీసూ, ఇతర వ్యక్తిగత సంభాషణల సమయాన్ని ఇంటికొచ్చాక తగ్గించండి. ముందుగానే ఈ విషయాన్ని మీ సహోద్యోగులకూ, స్నేహితులకూ చెప్పేయండి. మరీ అత్యవసరమైతే సంక్షిప్త సందేశాన్ని ఇవ్వమని సూచించండి. దాంతో కుటుంబ జీవితానికి తగినంత సమయాన్ని కేటాయించుకోవచ్చు.
* సామాజిక మాధ్యమాలు కొత్త బంధాలకూ, అనుబంధాలకూ కారణం కావొచ్చు. కానీ అదేపనిగా వీటితో ఉండి సమయం వృథా చేస్తుంటే అది ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులనూ, అనుమానాలనూ, అపోహలనూ కలిగించవచ్చు. కాబట్టి వాటి కారణంగా కుటుంబ జీవితానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి.
* ల్యాప్‌టాప్‌ అయినా ఫోన్‌ అయినా సరే.. ఇద్దరూ ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు వాటిని వీలైనంత దూరంగా ఉంచండి. ముఖ్యంగా రాత్రుళ్లు పడకగదికి తీసుకురాకపోవడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. తరచూ వచ్చే సందేశాలు అవతలివారిని ఇబ్బంది పెడుతుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్