Open plot: ఆ ప్లాట్‌ ధర రూ.200 కోట్లు

ఫ్లోరిడాలోని 30 వేల చదరపు అడుగుల స్థలం ఏకంగా రూ.200 కోట్లు పలికింది. గతంలో ఇక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నివసించడం విశేషం

Published : 04 Feb 2024 01:58 IST

image Credit: Dina Goldentayer instagram

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్లోరిడాలోని మయామి బీచ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాని ఒడ్డున ఇల్లుంటే ఆ కిక్కే వేరు. అందుకే, అక్కడి ఓపెన్‌ ప్లాట్‌ను కొనుగోలు చేసేందుకు వందలాది మంది పోటీపడ్డారు. చివరికి దాని ధర 23.9 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.200 కోట్లు) పలికింది. గతంలో అక్కడ ఓ గ్యాంగ్‌స్టర్‌ నివసించడం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మయామి బీచ్‌ ఒడ్డున ఉన్న 30 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని డగ్లాస్‌ ఎలిమన్‌ రియల్‌ఎస్టేట్‌ సంస్థ అమ్మకానికి పెట్టింది. గతంలో ఇక్కడ  కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఏఐ క్యాప్‌వన్‌ నివసించేవాడు. 

అతడు మృతి చెందిన తర్వాత,  ఆ స్థలం వివాదాస్పదంగా మారడంతో ఆ భవనాన్ని నేలమట్టం చేసేశారు. తాజాగా దాన్ని అమ్మకానికి పెట్టగా రికార్డు స్థాయి ధర పలికింది. ఈ మేరకు న్యూయార్క్‌ పోస్టు కథనం వెలువరించింది. గ్యాంగ్‌స్టర్‌ నివాసమున్న స్థలం కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రదేశానికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఖాళీ స్థలం కావడంతో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవచ్చని చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు రాసుకొచ్చింది. 2021లో దీని ధర 10.75మిలియన్‌ డాలర్లు పలకగా.. రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువయ్యిందని నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని