Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్‌ దిగ్భ్రాంతి

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.

Updated : 04 Jun 2023 12:35 IST

వాషింగ్టన్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

‘‘భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన వల్ల ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. భారత్‌, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి’’ అని బైడెన్‌ అన్నారు.

రైలు ప్రమాదం (Odisha Train Accident)పై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌, జపాన్‌ ప్రధాన మంత్రులు ఫుమియో కిషిదా, రిషి సునాక్‌ నుంచి ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని