China: హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలతో చైనా సదస్సు..!
హిందూ మహా సముద్రంలోని కీలక దేశాలతో చైనా సమావేశం నిర్వహించింది. భారత్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
ఇంటర్నెట్‌డెస్క్: హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 19 దేశాలతో చైనా గత వారం కీలక సదస్సు నిర్వహించింది. ‘‘షేర్డ్ డెవలప్మెంట్: థియరీ అండ్ ప్రాక్టీస్ ఫ్రం ది ప్రాస్పెక్టివ్ ఆఫ్ బ్లూ ఎకానమీ’’ పేరిట యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్లో దీనిని నిర్వహించింది. ది చైనా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోపరేషన్ ఏజెన్సీ (సీఐడీసీఏ)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం. ఇండోనేషియా, పాకిస్థాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, అఫ్గానిస్థాన్, ఇరాన్,ఒమాన్,దక్షిణాఫ్రికా, కెన్యా, మొజాంబిక్,టాంజానియా,సీషెల్స్, మడగాస్కర్,మారిషస్, జిబూటీ, ఆస్ట్రేలియా ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు.
చైనా ఆధ్వర్యంలో గతేడాది దక్షిణాసియా దేశాలతో కొవిడ్ 19 టీకాల సహకారంపై సదస్సు నిర్వహించింది. దీనికి భారత్‌ను ఆహ్వానించలేదు. ప్రస్తుతం సీఐడీసీఏకు విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి లూ ఝాహి అధ్యక్షత వహిస్తున్నారు. విదేశీ సాయానికి అవసరమైన ప్రణాళికలు, విధనాలు, వ్యూహాల రూపకల్పనకు ఈ సమావేశం నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలోని సముద్ర విపత్తుల నివారణ, తీవ్రత తగ్గించడానికి అవసరమైన సహకారానికి సంబంధించి చైనా కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శ్రీలంకలో పర్యటించిన సమయంలో కీలక ప్రతిపాదన చేశారు. హిందూమహా సముద్రలోని ద్వీప దేశాలతో ఓ వేదిక ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించిన ఏడాది లోపే ఈ సదస్సు జరగడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Movies News
Rashmika: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది : రష్మిక
-
Politics News
Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన
-
World News
Earthquake: ఏ రాయి తొలగించినా ప్రాణం లేని దేహమే.. భూప్రళయంలో 8వేలకు చేరిన మరణాలు
-
Sports News
IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ హీరోలు వీరే!