china: తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు

చైనాలోని తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద ప్రవేశాలపై చైనా ఆంక్షలు విధించింది. 1989లో జరిగిన ఘటన నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద గూమికూడే అవకాశం నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.    

Published : 04 Jun 2023 23:45 IST

బీజింగ్‌: రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్దకు ప్రవేశాలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 1989లో జరిగిన ప్రజాస్వామ్య అనుకూల నిరసనల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఈ ఆంక్షలు పెట్టారు. హాంకాంగ్‌లోని విక్టోరియా పార్కు వద్ద ఇద్దరు నిరసనకారులను పోలీసులు అరెస్టుచేశారు. 1989లో జూన్‌ 3 అర్ధరాత్రి, జూన్‌ 4 ఉదయం జరిగిన భారీ ప్రదర్శనపై సైన్యం ట్యాంకులతో విరుచుకుపడటంతో వేలమంది మరణించారు. వారికి నివాళిగా ప్రతి సంవత్సరం అక్కడ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించేందుకు పెద్దసంఖ్యలో గుమికూడుతారు. అయితే.. ఇటు చైనాలోను, అటు హాంకాంగ్‌లో సైతం 2020 జూన్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని కఠినంగా అమలుచేసి, నిరసనలపై ఆంక్షలు పెట్టారు. 1989లో జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతమంది మరణించారో ఇప్పటికీ తెలియదు. ఇక బీజింగ్‌లో తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అటువైపుగా నడిచి గానీ, సైకిల్‌ మీద వెళ్లినా పోలీసులు ఆపి, వారి గుర్తింపు చూపించాలంటున్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని