Corona: హెచ్‌ఐవీ బాధితురాలిలో 21 కరోనా మ్యుటేషన్స్‌

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా హెచ్‌ఐవీ బాధితుల్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇలాంటి వారిలో కరోనా వైరస్‌ వ్యాపించడమే కాదు, ఉత్పరివర్తనం చెందుతుందన్న వాదనలున్నాయి. అయితే,

Published : 31 Jan 2022 15:21 IST

కేప్‌టౌన్‌: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా హెచ్‌ఐవీ బాధితుల్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇలాంటి వారిలో కరోనా వైరస్‌ వ్యాపించడమే కాదు, ఉత్పరివర్తనం చెందుతుందన్న వాదనలున్నాయి. అయితే, దక్షిణాఫ్రికాలో శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధన ఫలితాలు ఆ వాదనలకు మరింత బలం చేకూరేలా ఉన్నాయి. చికిత్స సరిగా తీసుకోని ఓ హెచ్‌ఐవీ బాధితురాలిని శాస్త్రవేత్తలు పరీక్షించగా ఆమె శరీరంలో కరోనా వైరస్‌ 21 ఉత్పరివర్తనాలు చెందినట్లు గుర్తించారు. ఆమెకు తొమ్మిది నెలల కిందట కరోనా సోకడం గమనార్హం.

స్టెల్లాన్‌బోష్ యూనివర్సిటీ, క్వాజులు నాటల్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. కరోనా సోకిన 22 ఏళ్ల హెచ్‌ఐవీ బాధిత యువతికి రోగనిరోధక శక్తిని పెంచడానికి, హెచ్‌ఐవీ తీవ్రతను తగ్గించడానికి యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు ఇచ్చారు. దీంతో ఆమె ఆరు నుంచి తొమ్మిది వారాల్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అదే చికిత్స సరిగా తీసుకోని మహిళ శరీరంలో కరోనా వైరస్‌ తొమ్మిది నెలల పాటు తిష్టవేయడమే కాకుండా.. మరింత శక్తిమంతంగా మారి 21 ఉత్పరివర్తనాలు చెందింది. ఇందులో స్పైక్ ప్రోటీన్‌లోనే 10 మ్యుటేషన్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. వైరస్‌లోని ఈ స్పైక్ ప్రోటీనే వైరస్‌ను శరీరంలోని అవయవాలను గట్టిగా పట్టుకుని ఉంచడానికి ఉపయోగపడతాయి. హెచ్‌ఐవీ వైరస్ దక్షిణాఫ్రికాలోనే ఎక్కువగా సోకుతుంటుంది. ఆ దేశంలో 6 కోట్ల జనాభా ఉంటే.. అందులో 82 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని