UK VISA: యూకేలో కొత్త వీసా రూల్స్‌.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత..?

బ్రిటన్‌ తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనలు (Visa rules UK) భారత్‌తో సహా అందరు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 17 Aug 2023 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత విద్యకోసం భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడాతోపాటు బ్రిటన్‌పై (Study in UK) భారీ సంఖ్యలో మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల యూకే యూనివర్సిటీల్లో చదువుతోన్న విద్యార్థులు లేదా అక్కడ చదివేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలు (New immigration system) తీసుకువచ్చింది. ఇలా కొత్తగా తీసుకువచ్చిన వీసా నిబంధనలపై (Visa rules UK) ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Visa Rules: విద్యార్థి వీసాల్లో మార్పుతో.. జాబ్స్‌కు బ్యాక్‌డోర్‌ బంద్‌

  • విదేశీ విద్యార్థులకు బ్రిటన్‌ ప్రభుత్వం వీసా నిబంధనలు మార్చిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించిందా..? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఔను అని ప్రభుత్వం బదులిచ్చింది.
  • బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. జులై 17, 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది.
  • పరిశోధన ప్రోగ్రామ్‌గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప.. తమపై ఆధారపడిన వారిని తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి లేదు. జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.
  • బ్రిటన్‌లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల్లో అనేకమంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్‌-టైం ఉద్యోగం చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్త వీసా నిబంధనలు వారిపై ఏవిధమైన ప్రభావం చూపిస్తాయని సభ్యులు అడిగిన ప్రశ్నకూ భారత ప్రభుత్వం బదులిచ్చింది.
  • 2022లో ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 1.39లక్షలు (ఆధారపడిన వారు మినహా). ఈ కొత్త వీసా రూల్స్‌ అందరు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
  • ఇరు దేశాల పౌరులు, విద్యార్థులు, ఉద్యోగుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై బ్రిటిష్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని