NATO: నాటోలో ఫిన్లాండ్ చేరిక ఖరారు.. నేడే సభ్యత్వం!
నాటో కూటమిలో 31వ దేశంగా ఫిన్లాండ్ అవతరించనుంది. మంగళవారం ఈ మేరకు సభ్యత్వం అందజేయనున్నట్లు నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ తాజాగా ప్రకటించారు.
బ్రసెల్స్: నాటో (NATO)లో మరో దేశం సభ్యత్వం ఖరారైంది. ఈ కూటమిలో 31వ దేశంగా ఫిన్లాండ్ (Finland) భాగస్వామ్యం కానుంది. మంగళవారం నాటోలో ఫిన్లాండ్ సభ్య దేశంగా మారనున్నట్లు కూటమి సెక్రెటరీ జనరల్ స్టోల్తెన్‌బర్గ్ (Stoltenberg) తాజాగా ప్రకటించారు. అదే రోజు బ్రసెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయం బయట ఫిన్లాండ్ జాతీయ పతాకం ఎగురవేస్తామని వెల్లడించారు. ‘ఫిన్లాండ్ భద్రతకు, నార్డిక్ భద్రతకు.. మొత్తం ‘నాటో’కు ఇది మంచి రోజు. ఫలితంగా స్వీడన్ కూడా సురక్షితంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరికపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తుర్కియే(Turkey).. ఇటీవల సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అక్కడి పార్లమెంట్ తీర్మానించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాలతో.. నాటోలో చేరిక దిశగా ఫిన్లాండ్ గతేడాది మేలో ముందడుగు వేసింది. ఈ దేశం రష్యాతో దాదాపు 1300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. అయితే, ఫిన్లాండ్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని తుర్కియే మొదట్లో ఆరోపించింది. ఇటీవల అనుకూలంగా స్పందించడంతో ఫిన్లాండ్ చేరికకు మార్గం సుగమమైంది.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతోపాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఒక దేశం నాటోలో చేరాలనుకుంటే.. ముందుగా కూటమిలోని 30 సభ్యత్వ దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం