Australia: ఆస్ట్రేలియాలో నీటమునిగి నలుగురు భారతీయులు మృతి

ఆస్ట్రేలియా(Australia)లో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 25 Jan 2024 14:50 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా(Australia)లో నలుగురు భారతీయలు(Indians) దుర్మరణం చెందారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్‌(beach at Phillip Island)కు చెందిన బీచ్‌ వద్ద వారంతా నీట మునిగి మరణించారు. 20 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఈ తరహా విషాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

బుధవారం మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిలిప్‌ ఐలాండ్ బీచ్ సమీపంలో వారిని గుర్తించిన సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడే ముగ్గురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. వీరు పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. దీనిపై కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ స్పందించింది. ‘ఆస్ట్రేలియా(Australia)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటమునిగి నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాం. ఇతర సహాయచర్యల నిమిత్తం మెల్‌బోర్న్‌ అధికారులు మృతుల సన్నిహితులతో టచ్‌లో ఉన్నారు’ అని వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని