అమెరికాలో సామాన్యుడికి రూ.6,250 కోట్ల లాటరీ

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తి సుమారు రూ.6,250 కోట్లకుపైగా (754.6 మిలియన్‌ డాలర్లు) సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు.

Published : 08 Feb 2023 04:50 IST

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఓ వ్యక్తి సుమారు రూ.6,250 కోట్లకుపైగా (754.6 మిలియన్‌ డాలర్లు) సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు. పవర్‌బాల్‌ లాటరీ గేమ్‌లో ఆ వ్యక్తి ఈ భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారు. ఒక టికెట్‌.. మొత్తం ఆరు నంబర్ల(05, 11, 22, 23, 69, 07)తో సరిపోలిందని.. దీని మొత్తం విలువ రూ.6,250 కోట్లకుపైనే అని లాటరీ నిర్వాహకులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విజేతను గుర్తించాల్సి ఉంది. జాక్‌పాట్‌ నగదు మొత్తాన్ని విజేతకు విడతలవారీగా చెల్లిస్తారు. తొలుత కొంతభాగం ఇచ్చేస్తారు. మిగిలిన మొత్తాన్ని గెలిచిన సమయం నుంచి 29 సంవత్సరాల వరకు దశల వారీగా చెల్లిస్తారు. గెలుచుకున్న మొత్తానికి సంవత్సరానికి 5 శాతం చొప్పున వడ్డీని జతచేస్తారు. విజేత అందుకు అంగీకరించని పక్షంలో 754.6 మిలియన్‌ డాలర్ల జాక్‌పాట్‌ మొత్తం కాస్తా 407.2 మిలియన్‌ డాలర్లకు తగ్గుతుంది. ఆ సొమ్ము అంతటినీ విజేత చేతికి ఒకేసారి అందజేస్తారు. అమెరికా లాటరీ చరిత్రలో ఇది తొమ్మిదో అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని