కోడితో పనిలేని చికెన్‌.. కృత్రిమ కోడి మాంసం అమ్మకాలకు అమెరికాలో అనుమతి

జంతు హింస అని బాధపడకుండా.. ఇక పౌరులు హాయిగా  చికెన్‌ను లొట్టలేసుకుంటూ తినేయ్యొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది.

Updated : 27 Jun 2023 06:06 IST

ప్రయోగశాలలో అభివృద్ధి.. తొలుత రెస్టారెంట్లలో...

వాషింగ్టన్‌ : జంతు హింస అని బాధపడకుండా.. ఇక పౌరులు హాయిగా  చికెన్‌ను లొట్టలేసుకుంటూ తినేయ్యొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మొదట రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలు పెట్టి.. ఆ తర్వాత సూపర్‌ మార్కెట్లలోనూ ఈ చికెన్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయోగశాలలో కోళ్ల మూలకణజాలాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన అప్‌సైడ్‌ ఫుడ్స్‌, గుడ్‌ మీట్‌ కంపెనీలకు.. చికెన్‌ను కృత్రిమంగా తయారు చేసేందుకు.. వాటిని విక్రయించేందుకు అనుమతి లభించింది. గుడ్‌ మీట్‌ తయారీ భాగస్వామి అయిన జోయిన్‌ బయోలాజిక్స్‌ కూడా మాంసాన్ని తయారు చేసేందుకు ఆమోదం పొందింది. ఈ కంపెనీల చికెన్‌ ఉత్పత్తులు మానవ వినియోగానికి సురక్షితమైనవిగా నిర్ధారించారు.

కావలసిన విధంగా పోషకాలు

పోషకాల విషయంలో కృత్రిమ మాంసం జంతు మాంసంతో సమానంగానే తులతూగుతుంది. అవసరమైతే పోషకాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదులను పెంచుకోవచ్చు. అయితే పశువులు, కోళ్ల పెంపకంతో పోలిస్తే ప్రయోగశాలలో వృద్ధి చేసే మాంసంతో ఎక్కువ గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు విడుదలవుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని