Covid-19: కొవిడ్‌-19 చైనా తయారీ జీవాయుధమే

ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19.. చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసిన జీవాయుధమని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ పరిశోధకుడు చోవోషావ్‌ పేర్కొన్నారు.

Updated : 29 Jun 2023 09:38 IST

వుహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుడి వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19.. చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసిన జీవాయుధమని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ పరిశోధకుడు చోవోషావ్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ను జీవాయుధంలా వాడుకునేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు. ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సభ్యురాలు జెన్నిఫర్‌ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ ల్యాబ్‌లో ఉన్నతాధికారి ఒకరు మొత్తం నాలుగు రకాల వైరస్‌లను తమ సహచరులకు ఇచ్చి.. ఏది వేగంగా ఎక్కువ జాతులకు వ్యాపిస్తుందో గుర్తించాలని ఆదేశించారని తెలిపారు. దీంతోపాటు సులువుగా దీనిని వేరే వ్యక్తులు, జాతులకు సోకేలా చేసేందుకు ఉన్న మార్గాలను కనుగొనాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను చోవో ఓ జీవాయుధంతో పోల్చారు. 2019లో వుహాన్‌లో ప్రపంచ స్థాయి సైనిక క్రీడలు జరిగిన సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారని ఆయన వివరించారు. వారందరినీ సైనిక క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో పరిశుభ్రతను పరిశీలించేందుకు పంపినట్లు తెలిసిందని పేర్కొన్నారు. వాస్తవానికి పరిశుభ్రతను గుర్తించేందుకు వైరాలజిస్టుల అవసరం లేదని పేర్కొన్నారు. ఆ క్రీడాకారులున్న చోట వైరస్‌ను వ్యాప్తి చేసేందుకే వారిని పంపినట్లు తెలిసిందని చెప్పారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని