బంగారం కింద కోట్ల ఏళ్లనాటి మట్టీమశానం

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారం ఖనిజ నిక్షేపాల కింద అత్యంత పురాతన హిమానీనద అవశేషాలను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Updated : 13 Jul 2023 09:03 IST

దిల్లీ: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారం ఖనిజ నిక్షేపాల కింద అత్యంత పురాతన హిమానీనద అవశేషాలను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ అవశేషాలు 290 కోట్ల ఏళ్లనాటి హిమానీనదాల సంబంధించినవి. మంచు గడ్డగా ఉండే హిమానీనదం కరిగి నీరయ్యేటప్పుడు రాళ్లూమట్టీ కొట్టుకువస్తాయి. దక్షిణాఫ్రికాలో బయటపడినవి సరిగ్గా ఆ శిథిలాలే. వాటిని కనుగొన్న ప్రాంతం ఒకప్పుడు దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉండి క్రమేణా పైకి జరిగి ఉండవచ్చు. లేదా యావత్‌ భూగోళం మంచు బంతిలా మారి వాతావరణంలో కర్బనం, మీథేన్‌ పాళ్లు తగ్గి వ్యతిరిక్త గ్రీన్‌హౌస్‌ ప్రభావం ఏర్పడి ఉండవచ్చు. ఆ సమయంలో మంచు కప్పిన రాళ్లు, మట్టి ఇప్పుడు బయటపడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని