నేను అధ్యక్షుడినైతే.. మస్క్‌ను సలహాదారుగా నియమిస్తా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి గత శుక్రవారం అయోవాలోని టౌన్‌హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Aug 2023 05:44 IST

రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి వివేక్‌ రామస్వామి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి గత శుక్రవారం అయోవాలోని టౌన్‌హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా గెలిస్తే- టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని అన్నారు. ‘గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ ఎక్స్‌ పేరుతో దాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన ట్విటర్‌ను నడుపుతున్న మాదిరిగా నేను ప్రభుత్వాన్ని నడిపిస్తాను’ అని రామస్వామి పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం మస్క్‌ సైతం రామస్వామిని ‘నమ్మదగిన అభ్యర్థి’గా ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని