బాల్టిక్‌ ప్రాంతంలో జీపీఎస్‌ జామింగ్‌

బాల్టిక్‌ సముద్ర తీర ప్రాంతంలోని ఐరోపా దేశాల్ని జీపీఎస్‌ సిగ్నల్‌ సమస్య పీడిస్తోంది. గగనతలంలో ఉన్న విమానాలకు నకిలీ సంకేతాలు పంపి వాటి జాడను తప్పుగా చూపెడుతున్నాయంటూ ప్రముఖ ‘న్యూస్‌వీక్‌’ వార్తా సంస్థ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.

Published : 27 Mar 2024 04:12 IST

ఐరోపాలో వందల విమానాలపై ప్రభావం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల్టిక్‌ సముద్ర తీర ప్రాంతంలోని ఐరోపా దేశాల్ని జీపీఎస్‌ సిగ్నల్‌ సమస్య పీడిస్తోంది. గగనతలంలో ఉన్న విమానాలకు నకిలీ సంకేతాలు పంపి వాటి జాడను తప్పుగా చూపెడుతున్నాయంటూ ప్రముఖ ‘న్యూస్‌వీక్‌’ వార్తా సంస్థ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ఐరోపాలోని బాల్టిక్‌ సముద్రంతోపాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు అధికంగా జామింగ్‌కు గురవుతున్నాయని తెలిపింది. కేవలం రెండు రోజుల్లో 1,614 విమానాలు జామింగ్‌కు గురయినట్లు పేర్కొంది. పోలండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ స్వీడన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని వివరించింది. ఇది సాధారణంగా జరిగే జీపీఎస్‌ జామింగ్‌ కాదని.. గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతోందని వెల్లడించింది. ఇదే సమయంలో జీపీఎస్‌ వ్యవస్థను నిలిపివేసే సామర్థ్యం రష్యాకు ఉందని స్వీడన్‌ సైన్యం ఇటీవల అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని