Corona Virus: వదలని లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు

కొవిడ్‌-19 నుంచి బయటపడిన తరవాత కూడా నాలుగు నెలల వరకు తీవ్రమైన అలసట, తలనొప్పి పీడిస్తూనే ఉంటాయని అమెరికాలోని అగస్టా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం నిగ్గుదేల్చింది. కండరాల నొప్పులు, దగ్గు, వాసనలో,

Updated : 09 Aug 2022 07:26 IST

లండన్‌: కొవిడ్‌-19 నుంచి బయటపడిన తరవాత కూడా నాలుగు నెలల వరకు తీవ్రమైన అలసట, తలనొప్పి పీడిస్తూనే ఉంటాయని అమెరికాలోని అగస్టా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం నిగ్గుదేల్చింది. కండరాల నొప్పులు, దగ్గు, వాసనలో, రుచిలో మార్పులు, జ్వరం, చలి, ముక్కు దిబ్బడ కూడా దీర్ఘకాలం వదలవని తెలిపింది. కొవిడ్‌ వ్యాధి నాడీ కణజాలంలోనూ, మానసికంగానూ తీవ్ర మార్పులు కలిగిస్తుందని నిర్ధారణ అయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తమ పరిశోధనకు 200 మందిని ఎంచుకున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి 125 రోజుల పాటు వారిని పరిశీలనలో ఉంచారు. వారిలో 68.5 శాతం మందిని తీవ్ర అలసట పీడించింది. 66.5 శాతంమంది తలనొప్పితో బాధపడ్డారు. 54 శాతంమంది వాసన, రుచిలో తేడాలు వచ్చాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని