China: సైనిక విన్యాసాలు ఆపే ప్రసక్తే లేదు: చైనా

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా ఆగ్రహం ఇంకా చల్లారలేదు. పెలోసీ.. తైవాన్‌ సందర్శిస్తానని ప్రకటించిన సమయంలో నాలుగు రోజుల సైనిక విన్యాసాలను

Updated : 09 Aug 2022 06:09 IST

బీజింగ్‌: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా ఆగ్రహం ఇంకా చల్లారలేదు. పెలోసీ.. తైవాన్‌ సందర్శిస్తానని ప్రకటించిన సమయంలో నాలుగు రోజుల సైనిక విన్యాసాలను డ్రాగన్‌ ప్రకటించింది. దీంతో ఇవి ఆదివారంతో ముగుస్తాయని అందరూ భావించారు. కానీ ఈ విన్యాసాలు ఆగవని సోమవారం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఆర్సీ) స్పష్టం చేసింది. తైవాన్‌ లక్ష్యంగా ఇవి కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంది. ఇంకెంత కాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత ఇచ్చేందుకు పీఆర్సీ నిరాకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని