Alcoholic: మద్యం ఒక్కసారి తాగినా.. బానిసలయ్యే ముప్పు!

‘నేనేమీ రోజూ తాగట్లేదు.. విందులు, వినోదాల సమయంలోనే తాగుతున్నా. మద్యపానంపై నాకు నిగ్రహం ఉంది’ అని ఎవరైనా అనుకుంటే.. వారు పొరపడుతున్నట్లేనని జర్మనీ పరిశోధకులు తాజాగా

Published : 16 Sep 2022 07:44 IST

బెర్లిన్‌: ‘నేనేమీ రోజూ తాగట్లేదు.. విందులు, వినోదాల సమయంలోనే తాగుతున్నా. మద్యపానంపై నాకు నిగ్రహం ఉంది’ అని ఎవరైనా అనుకుంటే.. వారు పొరపడుతున్నట్లేనని జర్మనీ పరిశోధకులు తాజాగా తేల్చిచెప్పారు. మద్యం ఒక్కసారి తాగినా.. జీవితాంతం దానికి బానిసలుగా మారే ముప్పుంటుందని హెచ్చరించారు. ఎలుకలు, పళ్ల ఈగల్లో ఆల్కహాల్‌ ప్రభావంపై వారు విస్తృత స్థాయిలో అధ్యయనం చేశారు. ఒక్కసారి మద్యం ప్రభావానికి గురైనా.. నాడీకణాల నిర్మాణంలో మార్పులు చోటుచేసుకునేందుకు అవకాశాలున్నట్లు అందులో తేల్చారు. ముఖ్యంగా నాడీకణాల్లోని సినాప్స్‌, మైటోకాండ్రియాల పనితీరును ఆల్కహాల్‌ (ఒకే ఒక్క మోతాదులోనే) మార్చగలుగుతున్నట్లు వారు తెలిపారు. ఫలితంగా వ్యక్తులు మద్యానికి బానిసలుగా మారే ముప్పు పెరుగుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని