వాయు కాలుష్యంతో శారీరక, మానసిక సమస్యలు

వాయు కాలుష్యానికి ఎక్కువగా గురికావడం వల్ల శారీరక, మానసిక సమస్యలు విరుచుకుపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

Published : 03 Dec 2022 05:11 IST

లండన్‌: వాయు కాలుష్యానికి ఎక్కువగా గురికావడం వల్ల శారీరక, మానసిక సమస్యలు విరుచుకుపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే అని వారు పేర్కొన్నారు. ‘యూకే బయోబ్యాంక్‌’లోని 3.6 లక్షల మంది డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అందులో పరీక్షార్థుల జన్యు, జీవనశైలి, ఆరోగ్య సమాచారం ఉంది. 36 శారీరక, ఐదు మానసిక ఆరోగ్య సమస్యల తాకిడిని విశ్లేషించారు. వాహన ఉద్గారాలతో ముడిపడిన వాయు కాలుష్యానికి.. ముఖ్యంగా పీఎం 2.5 రేణువులు, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ ప్రభావానికి ఎక్కువగా లోనుకావడం వల్ల కనీసం రెండు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడైంది. ఇలాంటివారికి నాడీ, శ్వాస, గుండె సమస్యల ముప్పు అధికమని తేలింది. కుంగుబాటు, ఆదుర్దా వంటి మానసిక రుగ్మతలకూ ఆస్కారముందని నిపుణులు పేర్కొన్నారు. గాల్లోని రేణువుల వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేటివ్‌ ఒత్తిడి, రోగ నిరోధక శక్తి అతిగా స్పందించడం వంటి సమస్యలు రావొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల మెదడు, గుండె, రక్తం, ఊపిరితిత్తులు, పేగులకు హాని కలగొచ్చని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని