పాక్‌ రాయబార కార్యాలయంపై మేమే దాడి చేశాం: ఐఎస్‌ఐఎస్‌-కే

అఫ్గానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయంపై దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌-కే) ప్రకటించింది.

Published : 05 Dec 2022 04:56 IST

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయంపై దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌-కే) ప్రకటించింది. ఈ దాడి నుంచి రాయబార అధికారులు తప్పించుకోగా.. ఓ భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం కార్యాలయం ప్రాంగణంలో రాయబారి, ఆయన భద్రతా సిబ్బంది లక్ష్యంగా తమ ఇద్దరి సాయుధులు దాడి చేశారని ఐఎస్‌ఐఎస్‌-కే సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్‌ అధికారులతో సంప్రదించి ఈ ప్రకటనను ధ్రువీకరించినట్లు విదేశాంగ అధికారులు తెలిపారు. రాయబార కార్యాలయం వద్ద భద్రతా లోపాలపై వెంటనే విచారణ జరపాలని పాకిస్థాన్‌ డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని