Taiwan: తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో.. అధికార పార్టీ విజయం

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార ‘డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ’ అభ్యర్థి లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. తైవాన్‌పై చైనా సార్వభౌమాధికార వాదనలను ఈయన వ్యతిరేకిస్తున్నారు.

Updated : 13 Jan 2024 21:06 IST

తైపీ: తైవాన్‌ అధ్యక్ష ఎన్నిక (Taiwan Presidential Election)ల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (DPP) సత్తా చాటింది. డీపీపీ తరఫున బరిలోకి దిగిన లాయ్‌ చింగ్‌ తె (Lai Ching-te) విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తున్నారు.

చైనాతో ఉద్రిక్తతల వేళ.. తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు

చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ద్వీప దేశం తమ భూభాగమేనంటూ డ్రాగన్‌ కొన్నేళ్లుగా వాదిస్తున్న విషయం తెలిసిందే. తరచూ ద్వీపం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ మధ్యే దీన్ని విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది. మరోవైపు.. తైవాన్‌ ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్-వెన్‌, ఉపాధ్యక్షుడు లాయ్‌ చింగ్‌లు తైవాన్‌పై బీజింగ్‌ సార్వభౌమాధికార వాదనలను వ్యతిరేకిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని