Taiwan: చైనాతో ఉద్రిక్తతల వేళ.. తైవాన్‌లో మొదలైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

Taiwan Elections: తైవాన్‌లో నేడు అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. చైనాతో ఉద్రిక్తతల వేళ.. ఈ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

Updated : 13 Jan 2024 11:00 IST

తైపీ: శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌ (Taiwan)లో నేడు అధ్యక్ష ఎన్నికలు (President Elections) జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. అధికార డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ తరఫున లాయ్‌ చింగ్‌ తె, ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్‌ పార్టీ తరఫున హు యు ఇయ్‌, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ నుంచి కో వెన్‌ జి.. అధ్యక్ష బరిలో ఉన్నారు. తొలి గంటల్లోనే ఈ ముగ్గురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు 113 చట్టసభ్యులను ఎన్నుకోనున్నారు.

అమెజాన్‌ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం

చైనా (China)తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటంతో వీటిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ద్వీప దేశం తమ భూభాగమేనంటూ డ్రాగన్‌ గత కొన్నేళ్లుగా వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచూ ఈ ద్వీపం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ మధ్యే దీన్ని తమ భూభాగంలో విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది.

ఈ పరిణామాల వేళ.. తైవాన్‌ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షమైన కువోమింగ్‌తాంగ్‌ పార్టీకి చైనాతో మంచి అనుబంధం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఈ పార్టీ గెలిస్తే.. తమ ప్రణాళికను సులువుగా అమలు చేయొచ్చని డ్రాగన్‌ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని