Sri Lanka Crisis: శ్రీలంకలో అనూహ్య పరిణామం.. కేబినెట్‌ మంత్రుల రాజీనామా

తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది.

Updated : 04 Apr 2022 06:32 IST

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మంది కేబినెట్ మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి రాజీనామా పత్రాలు అందజేశారు. అదివారం అర్ధరాత్రి జరిగిన సమావేశంలో మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాల నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో ప్రజలు గత కొన్నిరోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర హింస చెలరేగింది. పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని