Ukraine Crisis: బాంబ్ షెల్టర్‌లో ప్రసవించిన మహిళ

రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబుల మోతతో భయంతో గడుపుతున్న ఉక్రేనియన్లు..

Published : 28 Feb 2022 17:54 IST

లుహాన్స్క్: రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌లో పరిస్థితులు దయనీయంగా మారాయి. బాంబుల మోతతో భయంతో గడుపుతున్న ఉక్రేనియన్లు.. ప్రాణాలు రక్షించుకునేందుకు బంకర్లలో తలదాచుకుంటున్నారు. రష్యా మద్దతుదారుల అధీనంలో లుహాన్స్క్ ప్రాంతంలో ఉన్న బాంబ్ షెల్టర్‌లో తల దాచుకున్న ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళకు ప్రసవం చేసిన దృశ్యాలు, ఫొటోలను స్టారోబిల్స్క్ ఆస్పత్రి వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాయి. అప్పుడే పుట్టిన శిశువును ఎత్తుకుని ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని