Supreme Court: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలీజియం సిఫార్సు

తాజా వార్తలు

Updated : 17/09/2021 20:06 IST

Supreme Court: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలీజియం సిఫార్సు

దిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఎనిమిది మంది పేర్లను కేంద్రానికి సిఫార్సులు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను వేగంగా చేపడుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం తాజాగా కేంద్రానికి ఈ సిఫార్సులు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి ఎనిమిది మంది పేర్లను ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపించింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అరూప్‌కుమార్ గోస్వామి పేరును ఛత్తీస్‌గడ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రా పేరును సిఫార్సు చేసింది. అలహాబాద్‌ హైకోర్టుకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ పేరును, రాజస్థాన్‌ హైకోర్టుకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అఖిల్‌ ఖురేషి పేరును సిఫార్సులు చేసింది.

కర్ణాటక, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం కూడా సుప్రీంకోర్టు కొలీజియం తమ సిఫార్సులతో కేంద్రానికి జాబితా పంపించింది. ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు సహా 28 మంది హైకోర్టు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని వారు సిఫార్సు చేసినట్లు సమాచారం. న్యాయమూర్తుల పేర్లు, వారి వివరాలు సహా కొలీజియం నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని