కొత్తగా 647 కరోనా కేసులు

ప్రధానాంశాలు

కొత్తగా 647 కరోనా కేసులు

మరో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 647 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 6,40,659కు చేరింది. మహమ్మారి కారణంగా మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 3,780గా నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,20,213 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.  వైరస్‌ బారిన పడి చికిత్స అనంతరం 749 మంది కోలుకోవడంతో పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారిన వారి సంఖ్య 6,27,254కు పెరిగింది. మరో 9,625 మంది కొవిడ్‌ చికిత్సలో ఉన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ తగ్గింది. దాదాపు 1.43 లక్షల మందికి టీకా వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో తొలి డోసు కింద 13,264 మందికి, రెండో డోసు కింద 1,30,333 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు తొలి డోసు టీకా తీసుకున్న వారి సంఖ్య 1,10,38,678కు, రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య 28,03,337కి చేరింది.
ఏపీలో శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 మధ్య 74,820 నమూనాలను పరీక్షించారు. 2,174 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని