ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి

ప్రధానాంశాలు

ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి

కిసాన్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వరదల కారణంగా వ్యవసాయ రంగం బాగా దెబ్బతిందని.. ప్రధానంగా వరి, పత్తి, సోయాబీన్‌, పసుపు తదితర పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని