అన్ని జిల్లాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
close

ప్రధానాంశాలు

అన్ని జిల్లాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

విశ్రాంత టీజీవోల రాష్ట్ర సంఘం

ఈనాడు,  హైదరాబాద్‌: అన్ని జిల్లాల్లో వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రహిత అత్యుత్తమ వైద్య సేవలందించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.మోహన్‌నారాయణ సీఎం కేసీఆర్‌ను కోరారు. పింఛనుదారులకు పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో ఒకేసారి చెల్లించాలని అభ్యర్థించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  మాట్లాడారు. ఉద్యోగులు, పింఛనుదారులకు వైద్యసేవలు అత్యవసరమని, ప్రభుత్వం  దానిపై దృష్టి సారించాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.నరసరాజు, ఇతర నేతలు యాదయ్య, రవీందర్‌, ప్రభాకర్‌, ముత్యంరెడ్డి, బ్రహ్మానందం పాల్గొన్నారు.

పీఆర్సీని అమలు చేయాలి: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రాష్ట్ర సమాఖ్య

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల రాష్ట్ర సమాఖ్య ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు రాజేశం, జీటీ జీవన్‌ కోరారు. ఈ మేరకు వారు అన్ని సంస్థలకు మంగళవారం లేఖలు రాశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని