దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు 28 వరకు పెంపు

ప్రధానాంశాలు

దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ గడువు 28 వరకు పెంపు

ఆగస్టు 4న సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ మొదటి విడత రిజిస్ట్రేషన్‌ గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటికే పొడిగించిన గడువు శనివారంతో ముగియాల్సి ఉండగా తాజాగా దాన్ని ఈ నెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం వరకు 1.88 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 4న కేటాయిస్తామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5-9 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. రెండో విడత రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18 వరకు నిర్వహిస్తామని, ఆ విడత సీట్లను ఆగస్టు 25న కేటాయిస్తామని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని