పీఈటీ పోస్టుల భర్తీలో అర్హతలపై వివరణివ్వండి

ప్రధానాంశాలు

పీఈటీ పోస్టుల భర్తీలో అర్హతలపై వివరణివ్వండి

ఎన్‌సీటీఈకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ) పోస్టుల భర్తీకి అర్హతలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు ఏమిటో తెలపాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ పోస్టుల భర్తీలో మండలి నిబంధనలకు రాష్ట్ర నిబంధనలు విరుద్ధంగా ఉన్నట్లయితే ఏం చేయాలన్నదానిపై స్పష్టతనిస్తూ 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో పీఈటీ పోస్టుల భర్తీకి 2017 అక్టోబరులో జారీ చేసిన నోటిఫికేషన్‌లో క్రీడార్హతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో ఎన్‌సీటీఈ కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని