బలహీనంగా రుతుపవనాలు

ప్రధానాంశాలు

బలహీనంగా రుతుపవనాలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల కదలికలు రాష్ట్రంపై బలహీనంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వీపనగండ్ల (వనపర్తి జిల్లా)లో 1.4, కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌)లో 1 సెంటీమీటరు వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 డిగ్రీలు అదనంగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా తిమ్మారావుపేట (ఖమ్మం జిల్లా)లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ సాధారణంకన్నా 13 శాతం తక్కువగా ఉండటంతో పొడి వాతావరణం ఏర్పడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని