7 జిల్లాలకు కొత్త డీఈఓలు

ప్రధానాంశాలు

7 జిల్లాలకు కొత్త డీఈఓలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏడు జిల్లాలకు కొత్త డీఈఓలను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో అయిదుగురి అధికారులకు కొత్తగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించగా.. ఇప్పటికే డీఈఓలుగా పనిచేస్తున్న ఇద్దరిని పరస్పరం జిల్లాలు బదిలీ చేశారు. పెద్దపల్లి డీఈఓగా మాధవి, సూర్యాపేటకు మహమ్మద్‌ అబ్దుల్‌ మునఫ్‌, ములుగుకు జి.ఫణిని, మహబూబాబాద్‌కు ఎస్‌.సత్యనారాయణ, ఆసిఫాబాద్‌కు పి.అశోక్‌ను కొత్తగా నియమించారు. ఆదిలాబాద్‌ డీఈవోగా ఉన్న ఎ.రవీందర్‌రెడ్డిని నిర్మల్‌కు, నిర్మల్‌ డీఈఓ ప్రణీతను ఆదిలాబాద్‌ జిల్లాకు బదిలీ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని