వర్షాకాలంలో చర్మం పాడవకుండా... - beauty tips in rainy season
close
Updated : 21/07/2021 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్షాకాలంలో చర్మం పాడవకుండా...

'మేఘం కరిగెను.. మెరుపై మెరిసెను.. చినుకులు చిందెను.. హృదయం పొంగెను..' - అంటూ వర్షంలో తడుస్తూ పసిపాపల్లా ఎంజాయ్ చేసే రోజులు వచ్చేశాయి. ఇలా తడుస్తూ ఆనందించడం వరకు బాగానే ఉంటుంది. కానీ వర్షం ప్రభావం అందం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు.. అప్పుడప్పుడూ ఎండ కూడా విజృంభిస్తుంది. ఇలాంటి భిన్నమైన వాతావరణంలో వర్షంలో తడిస్తే చర్మం పాడయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా..

రోజ్‌వాటర్‌తో..

పావుకప్పు రోజ్‌వాటర్‌ని తీసుకొని దానికి టేబుల్‌స్పూన్ చందనం పొడి, పావు చెంచా పసుపుని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్, పొక్కుల వంటివి తొలగిపోయి ముఖ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. పసుపు, చందనంలో ఉన్న ఔషధ గుణాలు చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చేస్తాయి.

గ్రీన్‌టీతో..

రెండు టేబుల్‌స్పూన్ల గ్రీన్ టీపొడి తీసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కల బాదం నూనె జత చేసి బ్లెండర్‌తో బాగా మెత్తగా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమంలో బాదం నూనెకు బదులు మీ చర్మతత్వానికి సరిపడే ఇతర అత్యవసర నూనెల్ని సైతం ఉపయోగించవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ వేసుకోవడం వల్ల దురద, ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరి చేరవు.

పుదీనాతో..

గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. అరటిపండులో సగభాగాన్ని తీసుకొని దాన్ని కూడా మెత్తగా చేసుకోవాలి. ఈ రెండిటినీ బ్లెండర్‌తో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్ బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటి చర్మానికి పోషణనిచ్చి తేమను కోల్పోకుండా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే గుణాలు పుదీనాలో ఉన్నాయి.

ముల్లంగితో..

ముల్లంగిలో సగభాగం తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నిమ్మలో ఉన్న విటమిన్ 'సి' చర్మానికి పోషణనివ్వడంతో పాటు అలర్జీలు రాకుండా చూస్తుంది. ముల్లంగిలో ఉన్న సుగుణాలు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.

కోడిగుడ్డు తెల్లసొనతో..

గుడ్డులోని తెల్లసొనకు చెంచా తేనె జతచేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం క్లెన్సర్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే మేను జిడ్డుగా మారకుండా కాపాడుతుంది.

గంజితో..

వర్షాకాలంలో వాతావరణ ప్రభావం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. ఇవి రాకుండా చాలామంది రకరకాల యాంటీబయోటిక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనకు అందుబాటులో ఉండే గంజి కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వదట. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు, ఔషధగుణాలు అలాంటివి మరి. ఇది కేవలం చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రానీయకుండా చేయడమే కాదు.. మూసుకుపోయిన చర్మరంధ్రాలను సైతం తెరచుకునేలా చేస్తుంది.

ఇవీ.. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఫేస్‌ప్యాక్‌లు. మరి మీరు కూడా వీటిని ప్రయత్నించి చర్మాన్ని సంరక్షించుకుంటారు కదూ..!


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని