పోలియోను ఓడించి.. తను గెలిచింది!  - bhavinaben patel enters the final in table tennis paralympics
close
Updated : 28/08/2021 18:41 IST

పోలియోను ఓడించి.. తను గెలిచింది! 

పన్నెండు నెలల ప్రాయంలోనే పోలియో...శస్త్రచికిత్సకు వెళ్లినా విఫలం... నవ్వుతూ గెంతులేయాల్సిన వయసులో వీల్‌చైర్‌కే పరిమితం... ఇలా బాల్యంలోనే సుడిగుండాల్లాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొంది భవీనా. అయినా టేబుల్‌ టెన్నిస్‌పై ప్రేమను పెంచుకుని దానినే కెరీర్‌గా మల్చుకుంది. అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లోనూ భారత్‌కు మొదటి పతకాన్ని ఖాయం చేసింది.

ఫైనల్‌కు చేరుకుని!

టోక్యోలో మళ్లీ మన త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. పారాలింపిక్స్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో 34 ఏళ్ల భవీనా బెన్‌ పటేల్‌ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. మొదటి రౌండ్‌ మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ఆమె నిరాశపడకుండా తన పోరాటపటిమను కొనసాగించింది. తనకంటే మెరుగైన ర్యాంకింగ్స్‌ ఉన్న ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో కనీసం రజత పతకం మన ఖాతాలో చేరినట్లయింది. ఆదివారం జరిగే పసిడి పోరులో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వింగ్‌ ఝౌతో తలపడనుంది భవీనా.

మొదటి భారతీయ క్రీడాకారిణిగా!

జాతీయ, అంతర్జాతీయ టీటీ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించిన భవీనా 2016 రియో పారాలింపిక్స్‌కు కూడా ఎంపికైంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు ఆమెను పోటీలకు దూరం చేశాయి. అలా 5 ఏళ్ల క్రితం కోల్పోయిన పతకాన్ని తాజాగా టోక్యో వేదికగా ఒడిసి పట్టుకుందీ పారా అథ్లెట్‌. తద్వారా పారాలింపిక్స్‌ టీటీలో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

పోలియోను ఓడించి..!

గుజరాత్‌లోని సుంధియా గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది భవీనా. దురదృష్టవశాత్తూ 12 నెలల ప్రాయంలోనే పోలియో బారిన పడింది. ఆర్థిక సమస్యల కారణంగా తండ్రి ఆమెకు వెంటనే చికిత్స చేయించలేకపోయాడు. ఎన్నో ఆపసోపాలు పడి విశాఖపట్నం తీసుకువచ్చి శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. క్రమంగా భవీనా నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఈ క్రమంలో వీల్‌చైర్‌లో ఉంటూనే తన గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2004లో భవీనా తండ్రి అహ్మదాబాద్‌ బ్లైండ్‌ పీపుల్స్ అసోసియేషన్‌లో ఆమెకు సభ్యత్వం ఇప్పించాడు. అక్కడ చదువుకుంటూనే ఫిట్‌నెస్‌ కోసం సరదాగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడడం మొదలుపెట్టింది. క్రమంగా ఆ ఆటనే కెరీర్‌గా మల్చుకుంది.

నేషనల్‌ ఛాంపియన్‌గా ఎదిగి!

కోచ్‌ లలన్‌ జోషి పర్యవేక్షణలో మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడిన భవీనా నేషనల్‌ ఛాంపియన్‌గా ఎదిగింది. ఆ తర్వాత 2011లో థాయిలాండ్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌ ఓపెన్‌లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారులను ఓడించి వెండి పతకం సాధించింది. అప్పటి నుంచి ఆమెకు తిరుగులేకుండా పోయింది. 2013 ఏషియన్‌ రీజనల్‌ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం, జోర్డాన్‌, తైవాన్‌, చైనా, దక్షిణ కొరియా, జర్మనీ, ఇండోనేషియా, స్లోవేనియా, థాయిలాండ్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, ఈజిఫ్ట్‌ తదితర దేశాల్లో జరిగిన టోర్నీల్లో లెక్కలేనన్ని పతకాలు గెల్చుకుంది. రియో ఒలింపిక్స్‌లో దురదృష్టం వెక్కిరించినా 2018 ఏషియన్ పారా గేమ్స్‌లో డబుల్స్‌ విభాగంలో రజత పతకం సాధించింది. 2019 థాయిలాండ్‌ ఇంటర్నేషనల్‌ పారా టీటీ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం గెల్చుకుంది.

లాక్‌డౌన్‌లో రోబోతో ప్రాక్టీస్!

కరోనా కారణంగా గతేడాది పెద్దగా టోర్నమెంట్లలో ఆడలేకపోయింది భవీనా. పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అయితే లాక్‌డౌన్‌లో ఆటపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఆమె ఏకంగా రోబోతో సాధన చేయడం విశేషం. భర్త నికుల్‌ పటేల్‌ దగ్గరుండి మరీ ఆమెకు అవసరమైన సహాయ సహకారాలు అందించాడు.

‘భవీనా కోసం రూ.50 వేలు పెట్టి సెకండ్‌ హ్యాండ్ రోబోను కొన్నాం. టీటీ ప్రాక్టీస్‌కు అనుగుణంగా దానికి మరికొన్ని మార్పులు చేశాం. లాక్‌డౌన్‌లో ఈ రోబోనే మాకు వరంలా కనిపించింది. దీని సహాయంతోనే నా భార్య రోజు కనీసం 8 నుంచి 12 గంటల పాటు టీటీ ప్రాక్టీస్‌ చేసింది. ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం పారాలింపిక్స్‌ పతక రూపంలో దక్కింది’ అని చెప్పుకొచ్చాడు నికుల్.

ఆల్‌ ది బెస్ట్‌ భవీనా!

ఆదివారం జరిగే పసిడి పోరు కోసం భవీనాతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బంగారు పతకంతో తిరిగిరావాలని ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా ట్వీట్లు పెడుతున్నారు. ‘కంగ్రాట్స్‌ భవీనా! అద్భుతంగా ఆడావు. రేపటి మీ విజయం కోసం యావత్‌ దేశం ప్రార్థిస్తోంది. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి’ అంటూ ట్విట్టర్‌ వేదికగా భవీనాకు సందేశం పంపించారు మోదీ.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని