కూరలో ఎక్కువైన ఉప్పుని తగ్గించేద్దామిలా! - easy ways to reduce excess salt in curry
close
Published : 04/07/2021 16:11 IST

కూరలో ఎక్కువైన ఉప్పుని తగ్గించేద్దామిలా!

టైం అయిపోతోందనే కంగారు వల్లో లేక మతిమరుపు వల్లో కొందరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. సాధారణంగా కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం ఎలాగో మీకు తెలుసా? అదెలాగో మీకు మేం చెప్తాం రండి..

* కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా ఉంటుంది.

* ఒక బంగాళాదుంప తీసుకుని ఒవెన్‌లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు వాటిని అందులో ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

* ఒకవేళ ఒవెన్ లేకపోతే పచ్చిబంగాళదుంపనే తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అందులో ఉడకనిస్తే సరి. అయితే వడ్డించే ముందు మాత్రం వీటిని కూరలోంచి బయటకు తీసేయడం మరచిపోవద్దు సుమా!

* 2 లేదా 3 చెంచాల పెరుగు కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు.. రుచి కూడా పెరుగుతుంది.

* పెరుగు వేయడం ఇష్టం లేనివారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.

* మీరు వండుతున్న కూరలో ఉల్లిపాయ, టొమాటో.. రెండూ కలిపి ముద్దగా చేసి ఆ కూరకు జతచేయచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా రుచికరంగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది.

* ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనెలో వేయించి కూరకు జత చేసుకుంటే రుచికి రుచి, ఉప్పదనం కూడా తగ్గుతుంది.

* గోధుమ పిండికి కొద్దిగా నీటిని జత చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని కూరలో వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయచ్చు.

* మీరు చేసే వంటకాన్ని బట్టి టొమాటో ముక్కలు లేదా టొమాటో పేస్ట్‌ని కూడా జత చేయచ్చు.

* ఒకవేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే కనుక మరికొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించినా ఫలితం ఉంటుంది.

* కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరి.

మరి, కూరలో ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? ఎలా తగ్గిస్తారు? ఆ చిట్కాలేంటో మాతో పంచుకోండి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని