రెండుసార్లు అబార్షనైంది.. అందుకే వాడు ‘రెయిన్ బో బేబీ’! - geeta basra says she suffered two abortions before son jovans birth
close
Updated : 03/08/2021 18:48 IST

రెండుసార్లు అబార్షనైంది.. అందుకే వాడు ‘రెయిన్ బో బేబీ’!

గర్భం ధరించిన మహిళలు ఎప్పుడెప్పుడు తమ పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకుందామా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలు పాటిస్తారు. అయితే ఎంత అప్రమత్తంగా ఉన్నా ఈ నవమాసాల ప్రయాణమన్నది ప్రతి మహిళకు ఓ పెను సవాలే. ఈ నేపథ్యంలో గర్భం దాల్చినా దురదృష్టవశాత్తూ చాలామందికి అది నిలవకపోవచ్చు. అందుకు కారణాలు అనేకం. ఈ క్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా తనకు వరసగా రెండుసార్లు గర్భస్రావం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె... రెండోసారి అమ్మయ్యే క్రమంలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది.

‘ద ట్రైన్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత ఆరేళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసింది . 2016లో హినయా హీర్‌ ప్లాహా అనే కూతురుకి జన్మనిచ్చింది. గత నెలలో రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొంది జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తన కుమారుడిని ‘రెయిన్‌బో బేబీ’ అని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అందుకు గల కారణాలను షేర్‌ చేసుకుంది.

‘రెయిన్‌ బో బేబీ’ !

సాధారణంగా తుఫాన్‌ లేదా పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసిన తర్వాత ఆకాశంలో ఇంధ్రధనస్సు ఏర్పడుతుంటుంది. అలాగే గర్భస్రావం తదితర కారణాలతో తల్లడిల్లిన తర్వాత పుట్టిన ఆరోగ్యకరమైన బిడ్డను ముద్దుగా ‘రెయిన్‌బో బేబీ’ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో తన బిడ్డను కూడా ‘రెయిన్‌బో బేబీ’ గా అందరికీ పరిచయం చేసింది గీత.

‘నాకు రెండుసార్లు గర్భస్రావం అయ్యాక జోవన్‌ జన్మించాడు. 2019లో ఒకసారి, గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో మరొకసారి అబార్షన్‌ జరిగింది. రెండుసార్లూ మొదటి త్రైమాసికంలో ఉన్నప్పుడే గర్భాన్ని కోల్పోయాను. ఇది నన్నెంతో బాధించింది. తీవ్ర నిరాశకు గురిచేసింది.’

మా వారు తోడుగా నిలిచారు!

‘వరుస అబార్షన్లతో గత రెండేళ్లు నేను తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. గర్భస్రావం తర్వాత మన శరీరంలోని హార్మోన్లు సమతుల్యత కోల్పోతాయి. ఫలితంగా జీవితంలో మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే భర్త, ఇతర కుటుంబ సభ్యుల తోడ్పాటు అవసరం. అబార్షన్‌ జరిగిన రెండుసార్లు మా వారు నాకు తోడుగా నిలిచారు.’

పెళ్లికి ముందే ప్లాన్‌ చేసుకున్నాను!

‘కనీసం ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలన్నది నా కోరిక. దీనికి సంబంధించి పెళ్లికి ముందే ప్రణాళికలు వేసుకున్నాను. ఈ క్రమంలో హినయాకు కూడా కచ్చితంగా ఓ తోడు కావాలనుకున్నాను. అయితే నా కోరిక అంత తొందరగా నెరవేరలేదు. గతేడాది లాక్‌డౌన్‌లో నాకు రెండోసారి గర్భస్రావమైంది. ఈ చేదు అనుభవం నుంచి నన్ను బయటపడేసేందుకు నా భర్త నన్ను పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లారు. వారు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇక అక్కడ ఉండగానే నేను నాలుగోసారి గర్భం ధరించాను.’

మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నా!

‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మొదటి త్రైమాసికంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ క్రమంలో- పోషకాహారం ఎక్కువగా తీసుకున్నా. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. ఆ తర్వాత ముంబయి వచ్చేశాను. యోగాతో పాటు నిపుణుల సూచనల మేరకు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. రెండోసారి అమ్మగా మారే క్రమంలో యోగా నాకెంతో సహకరించింది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో సానుకూల దృక్పథంతో ఆలోచించేలా చేసింది. ఈసారి అంతా మంచే జరుగుతుందని నా అంతరాత్మ కూడా చెప్పుకొచ్చింది. అదే నిజమైంది.’

నమ్మకాన్ని కోల్పోకూడదు!

‘అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది. నా స్నేహితుల్లో ఇద్దరికి కూడా ఇలాగే జరిగింది. దీని నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి త్వరగా బయటపడేందుకు మనం ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోకూడదు. మౌనంగా బాధపడడం మాని గర్భస్రావానికి గల కారణాలను గ్రహించాలి’ అని మహిళల్లో స్ఫూర్తి నింపిందీ అందాల తార.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని