నెలసరి ఒక రోజే అవుతోంది!
close
Published : 09/06/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలసరి ఒక రోజే అవుతోంది!

నా వయసు పదిహేడేళ్లు. ఎత్తు అయిదడుగులు. బరువు నలభైరెండు కిలోలు. 11 నెలలుగా పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌)తో బాధపడుతున్నా. అప్పటి నుంచి మాత్రలు వాడుతున్నా. నెలసరి సరిగ్గానే వస్తుంది. కానీ ఒకట్రెండు రోజులు మాత్రమే కొంచెం బ్లీడింగ్‌ అవుతోంది. నాకు థైరాయిడ్‌ లేదు. అవాంఛిత రోమాలు, జుట్టు రాలడం ఎక్కువగా ఉంది. నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి.

- ఓ సోదరి

పీసీఓడీ అనేది ఎన్నో రకరకాలుగా మహిళల్లో ప్రభావాన్ని చూపుతుంది. అందరిపై ఇది ఒకేలా ఉండదు. మీకు సంబంధించినంత వరకు దీన్ని లీన్‌ పీసీఓడీగా పరిగణిస్తారు. రుతుస్రావం ఒకరోజైనా దాన్ని సాధారణ నెలసరిగానే పరిగణిస్తాం. కాబట్టి దాని గురించి మీరేం ఆందోళన చెందొద్ధు ఎలక్ట్రోలైసిస్‌, లేజర్‌ లాంటి ఆధునాతన పద్ధతుల ద్వారా అవాంఛిత రోమాలను నిపుణుల పర్యవేక్షణలో తొలగించుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా రాకుండా ఉండేందుకు మాత్రలను వాడాల్సి ఉంటుంది. శరీరంలో ఆండ్రోజెన్‌/టెస్టోస్టిరాన్‌ శాతం ఎక్కువైనప్పుడు ఇలా అవాంఛిత రోమాలు అధికంగా రావడం, ప్రస్ఫుటమవడం జరుగుతుంది. దీన్ని నియంత్రించడానికి వైద్యుల సలహాతో మాత్రలు వాడాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోండి. ఎందుకంటే ఒత్తిడి వల్ల పీసీఓడీ ఎక్కువయ్యే ప్రమాదముంది. మీరు సన్నగానే ఉన్నారు కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ధ్యానంపై దృష్టి పెట్టండి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడుతూ, చర్మవైద్యులను కలిసి అవాంఛిత రోమాలను తొలగించుకోండి. వీటన్నింటి కంటే ముందు ఓసారి గైనకాలజిస్ట్‌ను కలవండి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని