కొత్త బార్బీలొచ్చాయ్‌!
close
Published : 23/07/2021 01:07 IST

కొత్త బార్బీలొచ్చాయ్‌!

అలలపై తేలియాడే సర్ఫింగ్‌, కొండలంచులకు చేరిపోయేలా క్లైంబింగ్‌, రయ్‌ అంటూ చక్రాల బూట్లతో దూసుకుపోయే స్కేట్‌బోర్డింగ్‌, సాఫ్ట్‌బాల్‌, కరాటే... ఇలా క్రీడాకారులకు అందమైన రూపాలను కల్పించింది బార్బీ సంస్థ. ప్రపంచ క్రీడలు, అంతరిక్ష యాత్రలు వంటి ప్రతి సందర్భానికీ తగినట్టుగా తనదైన శైలిలో పిల్లల మనసును దోచుకునే ఈ సంస్థ, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌ను థీమ్‌గా తీసుకుంది. ఇందులో క్రీడాకారిణులను పోలినట్లుగా బొమ్మలను డిజైన్‌ చేసింది. ఈ ఒలింపిక్‌ బార్బీలు పిల్లలకు ఆటలపై ఆసక్తి పెంచుతూ, స్ఫూర్తిని నింపుతున్నాయి. ఈ అందమైన బొమ్మలకు పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా ఫిదా అయిపోవాల్సిందే. కాదంటారా?

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని