చర్మ సంరక్షణలో... చూసి ఎంచుకోండి!
close
Updated : 11/08/2021 01:59 IST

చర్మ సంరక్షణలో... చూసి ఎంచుకోండి!


చిన్న మొటిమ, మచ్చ.. చాలదా అమ్మాయిల ముఖం చిన్నబోవడానికి! అందుకే అందాన్ని సంరక్షించడానికి ఎవరే ఉత్పత్తి వాడమన్నా, చిట్కాలు చెప్పినా చేసేస్తుంటారు. మరి అవి సరిపడకపోతే? అలా కాకూడదంటే ఇవోసారి గమనించండి.
* సమస్యలు - యాక్నే, డ్రైస్కిన్‌.. ఇంకా ఏవేవున్నాయో జాబితా రాసుకోండి. అన్నింటికీ ఒకే పరిష్కారం అందించే ప్రొడక్ట్‌లు ఏమున్నాయో చూసి ఎంచుకుంటే సరి. సి విటమిన్‌ కూడా ఉన్నది అయితే మచ్చలు, ఆన్‌ ఈవెన్‌ టోన్‌ వంటివీ దూరం చేస్తుంది.
* మీ చర్మతత్వానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. యాక్నే ఉన్నవారు సాల్సిలిక్‌ యాసిడ్‌, డ్రైస్కిన్‌ వాళ్లు హైఅలురోనిక్‌ యాసిడ్‌ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలి. అలాగే టాన్‌కి ఒకటీ, యాక్నేకీ మరోటి కాకుండా ఒకే దానిలో అన్ని అవసరాలూ తీర్చేలా ఏమేం ఉత్పాదనలు ఉన్నాయో పరిశోధించుకోండి. లేదంటే డబ్బూ వృథా.
* ఆలోచనలు, తాగే నీటిశాతం కూడా చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటంతోపాటు శరీరానికి తగినంత నీటిని అందించడమూ ముఖ్యమే.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని