ఈ పొరపాట్లు చేయొద్దు!
close
Published : 20/08/2021 01:16 IST

ఈ పొరపాట్లు చేయొద్దు!

పెళ్లిళ్లు, పండగలు, వ్రతాలు... ఏవైనా అమ్మాయిలు ఎక్కువగా ముస్తాబయ్యేది చూడచక్కని లెహెంగాలతోనే. అయితే వీటిని ధరించే విషయంలో కొన్ని పొరపాట్లు చేయొద్దంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు అవేంటో తెలుసుకుందామా..

లెహెంగా అంటే కాలి మడమలను దాటి నేలను తాకేలా ఉండాలి. అంతే తప్ప మోకాళ్లకు కాస్తపైకో, కిందకో ఉంటే అది లెహెంగా అనిపించుకోదు. పొడవైన రకం ఎంచుకుంటేనే దాని అందం రెట్టింపు అవుతుంది.

దుప్పట్టా... రకరకాల డిజైన్లతో, వర్కుతో ఉండే అందమైన లెహెంగాలకు జతగా వేసుకునే దుప్పట్టాలు కూడా అంతే అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. సాదాగా ఉండేవి ఎంచుకోవద్దు. లెహెంగాలకు నప్పేలా చక్కటి ప్రకాశవంతమైన దుప్పట్టాను ఎంచుకోవాలి.

జ్యూయలరీ.. చక్కటి మేకప్‌, చూడచక్కని ఆభరణాలను ధరించినప్పుడు మాత్రమే వేసుకున్న లెహెంగా అందం రెట్టింపు అవుతుంది. కాబట్టి లెహెంగాలకు నప్పే నగలపై దృష్టి పెట్టాలి. వీటిపైకి సంప్రదాయ ఆభరణాలను ఎంచుకోవాలి. లెహెంగా కంటే ఇవే ఎక్కువగా కనిపించకూడదు.

అన్నీ ఒకేలా... అస్సలొద్దు.. లెహెంగా, బ్లవుజు, దుప్పట్టా... ఇలా అన్నీ ఒకేరంగులో, డిజైన్‌లో ఉంటే అస్సలు బాగోదు. రంగుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్నీ ఒకేరకం దుస్తులు ఇప్పుడు ఫ్యాషన్‌ కాదు. మిక్స్‌ మ్యాచ్‌, మల్టీకలర్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి.

బెల్టుతో... ఇప్పుడు లెహెంగాకు బెల్టు కూడా పెట్టుకోవడం ఫ్యాషన్‌. అయితే ఇది లెహెంగాకు మ్యాచ్‌ (రంగు) అయ్యేలా చూసుకోవాలి.


దుప్పట్టా లేకుండా...

ఇప్పుడు లెహెంగాలు దుప్పట్టా లేకుండా కూడా కనువిందు చేస్తున్నాయి. అయితే వీటి ఎంపికలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్లవుజు చక్కగా, నిండుగా వచ్చేలా ఎంపిక చేసుకోవాలి.
మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని