మార్పులొస్తున్నా మూగనోమేనా!
close
Updated : 12/06/2021 01:02 IST

మార్పులొస్తున్నా మూగనోమేనా!

మహిళల నెలసరిపై కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఓ సర్వే తేల్చింది. సక్రమంగా రాకపోవడం, రక్తస్రావంలోనూ మార్పులు వంటి పలు అంశాలు ఈ సర్వేలో  వెల్లడయ్యాయి.    

‘ద సిక్స్త్‌ యాన్యువల్‌ మెనస్ట్రువల్‌ హైజీన్‌ సర్వే’ పేరుతో ఎవర్‌టీన్‌ సంస్థ నిర్వహించిన సర్వే 41 శాతం మంది మహిళల్లో నెలసరిలో పలు తేడాలను గుర్తించింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌తో తీవ్ర ఒత్తిడి, ఆందోళన దీనికి కారణం కావొచ్చని ఆ సర్వే భావించింది. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లో 18 నుంచి 35 ఏళ్లలోపున్న 5000 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 13.7 శాతం మంది కొవిడ్‌ బారిన పడగా, తీవ్ర ఒత్తిడి, ఆందోళనల ప్రభావం 64.5 శాతం మంది నెలసరిపై పడిందని భావిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో  రక్తస్రావంలో తేడాలు, తీవ్రమైన కడుపునొప్పి, నెలసరి క్రమం తప్పడం వంటివి కనిపించాయి. అయినప్పటికీ 25.5 శాతం మంది మాత్రమే వైద్యులను సంప్రదించారు. 43.8 శాతం మంది కనీసం వీటి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని చెబుతోంది ఈ అధ్యయనం. అలానే దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు శానిటరీ న్యాప్‌కిన్స్‌ లేక ఇబ్బంది పడ్డారంటోంది. వారంతా ప్రభుత్వం తమకు తేలిగ్గా వీటిని అందించేలా చూడాలనీ ఈ సంస్థను కోరారట.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని